Coolie-war 2: టాలీవుడ్‌లో టికెట్ ధరల హైక్ ట్రెండ్ గత దశాబ్దం నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు కూడా ఈ హైక్‌లు వర్తింపజేయడంతో ఏపీలో విమర్శలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ‘వార్ 2’, ‘కూలీ’ వంటి భారీ డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు పెంచడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిడ్ రేంజ్ సినిమాలకు కూడా హైక్‌లు విధించడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు తగ్గుతున్నారని నిర్మాతలే వాపోతున్నారు. ఈ ట్రెండ్ బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

