హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ఇటకాల నిర్మల, సోలంక రమ కల్లు మండపం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.