Thummala Nageswara Rao:రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో యూరియా కొరత లేదు. డమ్మీ ఫొటోలు పెట్టి ప్రతిపక్షాలు సర్కార్‌ఫై అభాండాలు వేస్తున్నదని ఇప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి నుంచి, మంత్రులు ఎమ్మెల్యేల వరకూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ, తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు యూరియా కొరత అంశంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Thummala Nageswara Rao:రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమేనని, రైతులకు సరిపడా యూరియాను ఇవ్వలేకపోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అంగీకరించారు. గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా రాష్ట్రానికి సరఫరా అయిందని తెలిపారు. యూరియా లోటును దృష్టిలో పెట్టుకొని జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Thummala Nageswara Rao:మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో వాస్తవమేమిటో తేలిపోయింది. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రానికి టార్గెట్ మేరకు యూరియా సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తున్నామని, కొరత అసలే లేదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ నేతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు మంత్రి తుమ్మల ప్రకటనతో అసలు వాస్తవమేమిటో తెలిసిపోయింది.