Kishkindhapuri Glimpse: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను పూర్తి హారర్-మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.తాజాగా విడుదలైన ‘కిష్కింధపురి’ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఉత్కంఠతో నిండి ఉంది. పాడుబడ్డ బంగ్లాలోని నిషిద్ధ తలుపు తెరవడంతో సూపర్‌న్యాచురల్ శక్తులు ఆవహించడం గ్లింప్స్‌లో హైలైట్. “‘కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు’” అనే ట్యాగ్‌లైన్ సినిమా సస్పెన్స్‌ను పెంచింది. బెల్లంకొండ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, అనుపమ నటనతో పాటు చిన్మయ్ సలస్కర్ సినిమాటోగ్రఫీ, సామ్ సిఎస్ సంగీతం గ్లింప్స్‌ను ఆకట్టుకునేలా చేశాయి.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మాన్సూన్‌లో రిలీజ్ కానుంది. హారర్ అండ్ సస్పెన్స్ ఫార్ములాతో ‘కిష్కింధపురి’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు.

