Campfire: చలి ఎక్కువగా ఉందని చలిమంట వేసుకున్నారు ఐదుగురు బాలికలు. కొద్దిసేపటికి వారిలో ముగ్గురు అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆ తరువాత మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్ జిల్లా పాలి గ్రామంలో నివసిస్తున్న ఐదుగురు బాలికలు గత రాత్రి 3 గంటల సమయంలో అక్కడ చలి ఎక్కువగా ఉండడంతో చెత్తను పోగుచేసి నిప్పుపెట్టి ఐదుగురికి చలికాచుకుంది. మరుసటి నిమిషాల్లో అందరూ వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నారు. షాక్‌కు గురైన వారి తల్లిదండ్రులు బాధిత బాలికలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: December 1st Changes: ఆమ్మో ఒకటో తారీఖు.. ఈ విషయాల్లో మార్పులు గమనించడం తప్పనిసరి!
Campfire: అక్కడ చికిత్స అందక దుర్గ(12), అమిత(14), అనిత(8) అనే ముగ్గురు బాలికలు మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.చల్లదనం కోసం నిప్పంటించిన చెత్త నుంచి విషపూరితమైన పొగలు పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.బాలికల మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుందని అంటున్నారు.

