Cow Odder: దుర్మార్గానికి పరాకాష్ట అంటే ఇదే. రోడ్డు మీద పడుకున్న ఆవుల పొడుగులను కోసి పారిపోయారు దుండగులు. పాపం ఆ ఆవులు అలానే చాలా గంటల పాటు రోడ్డు మీదనే ఉండిపోయాయి. తరువాత వాటి యజమాని వాటిని ఆసుపత్రికి చేర్చారు. హృదయాలను కదిలించే ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cow Odder: కర్ణన్ బెంగళూరులోని సామ్రాజ్పేటకు చెందినవాడు. అతను ఎనిమిది ఆవులను పెంచుతున్నాడు. వీటిలో నాలుగు ఆవులు ఇంటికి వచ్చి పాడుకుంటాయి. మరో నాలుగు ఆవులు మాత్రం ఇంటికి రావడం లేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఎక్కడో దగ్గర నిద్రబోతాయి.
Cow Odder: అదేవిధంగా శనివారం రాత్రి తన మూడు ఆవులు సామ్రాజ్పేట విజయనగరం రోడ్డులో ఉన్నాయి. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆవుల పొదుగును గుర్తు తెలియని ముఠా కత్తితో నరికేసింది. దీంతో ఆవులు నొప్పితో కొట్టుకున్నాయి. రాత్రంతా ఆవులు మూలుగుతున్నాయి. ఘటన జరిగిన రోడ్డు అంతా రక్తంతో నిండిపోయింది.
Cow Odder: ఉదయం జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జరిగిన ఘటన విషయంలో జంతువులపై క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడు ఆవులను చికిత్స నిమిత్తం సామ్రాజ్పేట వెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు.
విషయం తెలియగానే ప్రతిపక్షనేత అశోక్, బీజేపీ ఎంపీ పీసీ మోహన్, హిందూ సంస్థ నాయకులు, వాలంటీర్లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ మోహరించారు.

