Road Accident

Road Accident: మూడు రోజుల ముందు యాక్సిడెంట్.. ముగ్గురు మృతి..

Road Accident: మహారాష్ట్రలోని థానే జిల్లా పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-నాసిక్ హైవేలో కాసారా ఘాట్ సమీపంలో జూన్ 2వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో ముంబైకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం (జూన్ 6) ఉదయం దుర్వాసన రావడంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన వెలుగులోకి వచ్చింది.

కాసారా పోలీస్ స్టేషన్‌కి చెందిన ఇన్‌స్పెక్టర్ సురేష్ గవిత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన కారును రహదారి పక్కన ఉన్న లోతైన గుంతలో కనుగొన్నారు. విచారణలో ఆ కారు అదుపు తప్పి ముందుగా చెట్టును ఢీకొట్టి, ఆపై లోయలో పడిపోయినట్లు స్పష్టమైంది. ఈ దుర్ఘటనలో యజ్ఞేష్ వాఘేలా అనే యువకుడితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వీరంతా 25 నుండి 30 ఏళ్ల వయస్సు కలవారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో నలుగురికి రిమాండ్

ప్రమాదం జరిగిన ప్రాంతం యాసైనదిగా ఉండటంతో సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల చొరవతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించగా, కారు అంధేరి-ఖార్ ప్రాంతానికి చెందినదని ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు మోటారు వాహనాల చట్టం మరియు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతున్నదని వారు పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *