Atlee: కోలీవుడ్ దర్శకుడు అట్లీ తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించాడు. ప్రేమకథల నుంచి స్టైలిష్ యాక్షన్ డ్రామాల వరకు అతడి దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుంది. అయితే, అట్లీ సినిమాలపై కాపీ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, సామాజిక సందేశాలతో కూడిన శంకర్ శైలి యాక్షన్ చిత్రాలను తలపిస్తాయని విమర్శలు ఉన్నాయి. ఈ ట్రోల్స్‌కు అట్లీ స్పందిస్తూ, తన సినిమాల్లోని కథలు, పాత్రలు నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అట్లీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అట్లీ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా నిరూపించనున్నాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
