Virat Kohli: ఐపీఎల్-2025 చివరి దశకు వచ్చింది. ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. ఇవాళ క్వాలిఫయర్ 1లో పంజాబ్‌తో ఆర్సీబీ తలపడనుంది. సమంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు ఉత్కంఠను రేకిత్తించాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కోసం కొన్ని రికార్డులు వెయిట్ చేస్తున్నాయి.
పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరో 30రన్స్ చేస్తే ఆ జట్టుపై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్‌పై కోహ్లి 1104రన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1034 పరుగులు చేశాడు. అంతేకాకుండా మరో రికార్డు కూడా కోహ్లీని ఊరిస్తుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన వార్నర్ రికార్డును బ్రేక్ చేసేందుకు కోహ్లీ డుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు.
Also Read: South Africa vs Bangladesh: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఆటగాళ్లు..చివరకు..
Virat Kohli: కోహ్లి ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 హాఫ్ సెంచరీలు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ 9 అర్ధశతకాలు చేశాడు. ఈ సారి విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 602 పరుగులు చేశాడు. ఏది ఏమైన ఇవాళ్టి మ్యాచ్‌తో కోహ్లీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

