Heart Attack

Heart Attack: చిన్న వయస్సులో గుండెపోటుకు ఇవే కారణాలు

Heart Attack: చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారన్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. ఈ రోజుల్లో మారుతున్న జీవ‌న శైలిలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం స‌ర్య‌సాధారణ‌మైపోయింది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ర‌క‌ర‌కాల వ్యాధులు సంభ‌విస్తున్నాయి. అందులో ప్ర‌ధానంగా గుండె సంబంధిత వ్యాధులే ఎక్కువ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1 కోటీ 79 ల‌క్ష‌ల మంది గుండె సంబంధిత వ్యాధుల వ‌ల‌నే చ‌నిపోతున్నారంట‌.

గుండె శ‌రీర అవ‌యాల‌కు ర‌క్తం ద్వారా ఎన్నో పోష‌కాల‌ను, ఆక్సీజ‌న్‌ను అందిస్తుంది. అయితే యుక్త‌ వ‌య‌సులోనే ఎక్కువ మంది ఈ గుండె పోటు మ‌ర‌ణాల బారిన ప‌డుతుండ‌డం అత్యంత ఆందోళ‌న, బాధ‌ను క‌లిగిస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే మ‌న శ‌రీర భాగాలన్నీ కూడా స‌రైన పద్ధతిలో ప‌నిచేస్తుంటాయి. అందువ‌ల్ల గుండెను కాపాడుకోవ‌డంలో ప్ర‌తి మ‌నిషి నిర్లక్ష్యం చేయ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. అస‌లు గుండెపోటు ( హార్ట్ ఎటాక్) అంటే ఏమిటీ? ఎలా వ‌స్తుంది? దీనికి గ‌ల కార‌ణాలేంటో ఇప్పుడు చూద్దాం.

గుండెపోటు లక్షణాలు ఏంటి?

గుండెకు రక్తాన్ని సర‌ఫ‌రా రక్తనాళాలు బ్లాక్ అవ‌డం వల్ల గుండె పనితీరు స్తంభించడాన్ని గుండెపోటు (హార్ట్ ఎటాక్ ) అంటారు.

దీని ల‌క్ష‌ణాలు:

*ప్ర‌ధానంగా ఛాతిలో నొప్పి రావ‌డం

*ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ప‌డ‌డం

*ఛాతీ బ‌రువుగా అనిపించ‌డం

*ఎడ‌మ చేయి, ఇంక ఎడ‌మ డ‌వ‌డ నొప్పిగా ఉండ‌డం

*విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం

*మెడ మ‌రియు భుజాల వ‌ర‌కూ నొప్పి, తిమ్మిరి, లాగుతూ ఉండ‌డం

*న‌డిచేట‌ప్పుడు గుండె నొప్పి అధికంగా మారి ఉన్న‌ట్టుండి ప‌డిపోవ‌డం

గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాలు:

*ఒబెసిటి (అధిక బ‌రువు) క‌లిగి ఉండ‌డం

*మ‌ధుమేహం (షుగ‌ర్)

*అధిక రక్త‌పోటు (హై బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ )

*స్మోకింగ్ ( ధూమ‌పానం )

*కొలెస్ట్రాల్ అధికంగా ఉండ‌డం

*జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు

*శ‌రీరానికి త‌గిన వ్యాయామం లేక‌పోవ‌డం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *