Murder: వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు వంటి కారణాలతో నిత్యం హత్యలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఒక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్(36) చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు.
ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో పెళ్లి అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు.ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని బైక్ పై షాపుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.దీంతో అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
ఇది కూడా చదవండి: Crime News: ఇలా తయారేంట్రా స్వామి.. భర్త నాలుకను కొరికి మింగిన భార్య..
అయితే విచారణలో నందిని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సందేహం వచ్చింది. భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లుగా తెలిపింది. . నందినికి.. ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి భారత్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో భారత్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితులిద్దరినీ మంగళవారం కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు.

