SSMB 29: ఇండియన్ సినిమా చరిత్రలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబో సినిమా. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు తన కెరీర్ ఆరంభంలో ‘టక్కరి దొంగ’, ‘ఒక్కడు’ లాంటి చిత్రాల్లో ప్రమాదకర స్టంట్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే జోష్‌తో రాజమౌళి దర్శకత్వంలో రిస్కీ సన్నివేశాల్లో స్వయంగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డూప్‌లను పక్కనపెట్టి, మహేష్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లను చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండియన్ సినిమా రంగాన్ని షేక్ చేస్తుంది. మహేష్ డెడికేషన్ కి హ్యాట్సఫ్ అంటున్నారు మూవీ లవర్స్.రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో భారీగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు కొత్త లుక్, రాజమౌళి విజన్‌తో ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోనుంది.

