Single: టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన శ్రీవిష్ణు తాజా చిత్రం ‘సింగిల్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని మే 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా విడుదలైన ‘సింగిల్’ ట్రైలర్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.ట్రైలర్‌లో శ్రీవిష్ణు మార్క్ డైలాగ్ డెలివరీ, వెన్నెల కిషోర్‌తో కలిసి చేసే హాస్యం ప్రేక్షకులకు ఫుల్ ఫన్ రైడ్‌ను గ్యారెంటీ చేస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కల్యా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి!
