Tirumala: తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 19 కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60, 803 మంది భక్తులు కాగా..21, 930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు గా టీటీడీ వెల్లడించింది.
రేపు ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం సేవా టోకెన్లు విడుదల చేయనున్నారు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు రేపు ఉ. 11 గంటలకు విడుదల చేయనున్నారు, రేపు మ.3 గంటలకు వయోవృద్దులు, దివ్యాంగుల టోకెన్లు విడుదల చేయబోతున్నారు, ఎల్లుండి ఉ. 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల, ఎల్లుండి మ.3 గంటలకు వసతిగదుల కోటా టికెట్ విడుదల చేయనున్నారు టీటీడీ.