Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా కూరంమి ఆసిఫాబాద్ జిల్లాలో 12 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుంది.చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ గురించి కుటుంబ, ఆరోగ్య సంరక్షణశాఖ కమిషనర్ ఈ మేరకు పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు.
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువకు పడిపోయినప్పుడు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేస్తుంటారు. చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ గురించి కుటుంబ, ఆరోగ్య సంరక్షణశాఖ కమిషనర్ ఈ మేరకు పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డకట్టి గాయాలు కావటం, ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.