Vangalapudi Anitha

Vangalapudi Anitha: పోలీసులు లేకుంటే ప్రశాంతత లేదు

Vangalapudi Anitha: మంగళగిరి APSP బెటాలియన్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రజల శాంతి, భద్రతల వెనుక పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు.

ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం పోలీసులే అని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసు సిబ్బందికి, వారికి తోడుగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు కూడా మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా శాంతి భద్రతలు అవసరమని మంత్రి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరాలను నియంత్రించడంలో ముందున్నారు అని ప్రశంసించారు. అలాగే, నేటి ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారని ఆమె వివరించారు.

మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా చూస్తుందని మంత్రి అనిత భరోసా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

* గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్రంలో ‘ఈగల్ టీం’ ఏర్పాటు చేశాం.

* డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చడానికి ప్రభుత్వం పటిష్టంగా కృషి చేస్తోంది.

* నగరాలు, పట్టణాలలో భద్రతను పెంచేందుకు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం.

పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయడానికి 6,100 పోలీస్ నియామకాలు చేపట్టామని మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *