Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” పై భారీ అంచనాలు ఉన్నాయి. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి.అలానే మేకర్స్ లేటెస్ట్ గా మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఫుల్ స్వింగ్ లో ఈ పనులు జరుగుతున్నాయట. ఇక పవన్ కేవలం ఇంకొన్ని డేట్స్ ఇస్తే సినిమా పూర్తయ్యిపోతుందని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మే 9న ఫిక్స్ చేశారు. మరి అప్పుడైనా ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా, ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.
#HariHaraVeeraMallu dubbing in full swing, the journey of UNMATCHED HEROISM is inching closer to the silver screen! 🎙️🔥
Mark the date – May 9th, 2025. #HHVMonMay9th 💥💥
POWERSTAR @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani… pic.twitter.com/yEJgleiiAh
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 21, 2025