Super Star: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కూతురు సితార ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. వారిద్దరిని చూసిన ప్రతిసారి అభిమానులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. సూపర్ స్టార్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో..ఆయన కూతురు సితారకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న వయస్సులోనే చాలా పాపులారిటీని సంపాదించుకుంది. మహేష్ బాబు ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా సితార తన తండ్రితోనే సమయం గడుపుతూ ఉంటుంది.. తాజాగా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ చేసింది సితార.
Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లుపై సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
ఈ యాడ్‌లో సితార-మహేష్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.ఈ యాడ్‌లో మహేష్ బాబు అదిరిపోయారు. ప్రస్తుతం ఈ యాడ్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ యాడ్‌లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు. ఇక సితార అయితే నవ్వుతూ ఎంతో క్యూట్‌గా కనిపించింది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం SSMB29గా రూపొందుతోంది. ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చిత్రీకరణ జరుపుకుంది.