Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పనికి వెళ్లిన మహిళపై పులి దాడి చేసి చంపిన సంఘటన ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లా, జమ్మూ గ్రామానికి చెందిన రాజ్ బదులా భార్య కుట్టి దేవి బదులా, నిన్న మార్చి 09, 2025 ఉదయం తన పొలంలో పనికి వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పుడు, తన పెంపుడు కుక్కను తనతో తీసుకెళ్ళింది. పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అడవి గుండా నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా పులి ఆమెపై దాడి చేసింది. తప్పించుకోలేకపోయిన ఆమె విషాదకరంగా మరణించండి. ఆమె కేకలు వేసినప్పటికీ, సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెకు సహాయం లభించలేదు. ఆ పులి ఆమె మృతదేహాన్ని దాదాపు 300 మీటర్లు అడవిలోకి లాక్కెళ్లింది. కానీ ఆమె పెంపుడు కుక్క పులిని వెంబడించి మొరగడంతో పులి పారిపోయింది.
జమ్మూ గ్రామానికి చెందిన రాజ్ బదులా భార్య కుట్టి దేవి బదులా పొలాల్లో పనికి వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. తన భార్య ఇంటికి తిరిగి రాలేదని గమనించిన రాజ్ బదులా, ఆమెను వెతకడానికి పొలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తుండగా, ఒక కుక్క మొరుగుతుండటం గమనించి, ఆ దిశగా వెళ్ళినప్పుడు, తన భార్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. తన భార్యపై పులి దాడి చేసి చంపిందని అతనికి తరువాతే తెలిసింది.
Also Read: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కిడ్నాప్ హత్యల కలకలం.. వరుసగా ఘటనలు
Uttarakhand: కుట్టి దేవి బదులాపై పులి దాడి చేసి చంపిన సంఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖసిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కుట్టి దేవి మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం ఆసుపత్రికి పంపారు. శరీరం తల – వెనుక భాగంలో పులి దాడి ఆనవాళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు.
ఒక మహిళపై పులి దాడి చేసిన సంఘటన తర్వాత, ముందుజాగ్రత్తగా గ్రామాన్ని పర్యవేక్షించడానికి 10 మంది అటవీ శాఖ అధికారులను నియమించారు. అదనంగా, భద్రతా చర్యగా కీలకమైన ప్రదేశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, కుట్టి దేవి కుటుంబానికి అటవీ శాఖ రూ.2 లక్షల పరిహారం అందించింది.

