Crime News: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. సాయికుమార్ గౌడ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.. గొడ్డలితో గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు.. ఓ యువతితో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణామని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన సాయికుమార్ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మరో యువతితో కొద్దిరోజుల నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు.. మృతుడు సాయికుమార్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ దారుణ హత్యకు కారణమే ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: Visakhapatnam: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
Crime News: సాయికుమార్ విషయంలో యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది.. అయినా వినకపోవడంతో సాయికుమార్ పై కక్ష పెంచుకున్నాడని, అందుకునే ఈ హత్యకు కారణామే ఉంటుందని మరికొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.