The Goat Movie

ఓటీటీలోకి ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమిళస్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ది గోట్‌’.ఇందులో విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీసెప్టెంబ‌ర్ 5న ప్రపంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ లో విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టింది. సౌత్ తోపాటు నార్త్ లోనూ ఈ మూవీని విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ మొదటి వీకెండ్ లోనే భారీ వసూళ్లు రాబట్టింది. తమిళంలో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. తెలుగులోనూ ఈ సినిమాకు అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్కలేదు.

అయితే, తమిళంలో మాత్రం భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్.తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి, స్నేహ నటించారు. త్రిష స్పెషల్ సాంగ్ లో మెరిశారు. ప్రశాంత్‌, వైభ‌వ్‌, ప్రభుదేవా, లైలా, జయరాం, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించగా..యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pradeep Maddali: ‘వికటకవి’ ఆడియెన్స్‌కు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చే పీరియాడిక్ సిరీస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *