Election Commission: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ కౌంటర్ ఇచ్చింది. ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈసీ స్పష్టం చేసింది.
“ఆన్లైన్లో ఓట్లు డిలీట్ చేయడం అసాధ్యం”
ఓటర్ల జాబితా నుంచి ఓట్లను ఆన్లైన్లో డిలీట్ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతోందని ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, 2023లో కర్ణాటక అలంద్‌లో జరిగిన అక్రమాలను తామే స్వయంగా బయటపెట్టామని ఎన్నికల సంఘం గుర్తుచేసింది. ఈసీ నిష్పాక్షికతకు ఇది నిదర్శనమని పేర్కొంది.