War 2

War 2: వార్ 2 సూపర్ మ్యాజిక్.. హైపెక్కించేసిన డైరెక్టర్!

War 2: బాలీవుడ్, టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్ 2 సినిమా మరో ఆకర్షణతో సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తీర్చిదిద్దిన ఈ భారీ యాక్షన్ చిత్రం.. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్ లోనే చూడాలని దర్శకుడు సూచిస్తున్నారు. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి ట్రీట్ ఇవ్వనుందో చూడాలి.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సంచలన సాంగ్ లీక్!

వార్ 2.. ఇండియన్ సినిమాలో ఓ కొత్త అధ్యాయం! హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అయాన్ ముఖర్జీ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా డాల్బీ వెర్షన్ లో రిలీజ్ కానుంది. అత్యద్భుతమైన సౌండ్, విజువల్స్ తో థియేటర్ లో మాయాజాలం సృష్టించనుంది. దర్శకుడు అయాన్ స్వయంగా సినిమాను డాల్బీ ఫార్మాట్ లో చూడాలని సిఫార్సు చేస్తున్నారు. ఆగస్టు 14 నుంచి ఈ యాక్షన్ థ్రిల్ థియేటర్లలో సందడి చేయనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *