Traffic Challan: తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల మాఫీ గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకిలీ వార్తలపై ప్రజలు నమ్మకం పెట్టుకోవద్దని కోరుతూ, వారు ఒక ప్రకటనను విడుదల చేశారు.
“100 శాతం ట్రాఫిక్ చలాన్ల మాఫీ” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు అని పోలీసులు తేల్చి చెప్పారు. వాట్సాప్‌లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‌లను, యూట్యూబ్ వీడియోలను అస్సలు నమ్మవద్దు అని ప్రజలను కోరారు.
ట్రాఫిక్ చలాన్ల మాఫీపై ఇప్పటివరకు పోలీసులు కానీ, లోక్ అదాలత్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు అని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి, చలాన్ల మాఫీ విషయంలో అధికారిక సమాచారం వచ్చేంతవరకు, ఇలాంటి నకిలీ ప్రచారాలను పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

