Boycott Sitaare Zameen Par

Boycott Sitaare Zameen Par: సితారే జమీన్ పర్ సినిమాపై ఆగని బాయ్‌కాట్ ట్రెండ్!

Boycott Sitaare Zameen Par: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ నిన్న జూన్ 20న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో #BoycottSitaareZameenPar ట్రెండ్ హీటెక్కింది. ఇప్పుడు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఈ బాయ్‌కాట్‌కు మూడు ప్రధాన కారణాలు చెప్పబడుతున్నాయి.

మొదటిది, సినిమా స్పానిష్ చిత్రం ‘ఛాంపియన్స్’ రీమేక్ కావడంతో, ఒరిజినల్ కంటెంట్ లేకపోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండోది, ఆమీర్ ఖాన్‌పై కొంతమంది హిందుత్వవాదులు వ్యక్తిగత ఆగ్రహం చూపుతూ, ఆయన దేశభక్తి లేని వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు.

Also Read: Ananya Panday: లవ్ బ్రేకప్.. కుమిలిపోయిన అనన్య!

Boycott Sitaare Zameen Par: మూడోది, ఆమీర్ గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విఫలమవడంతో, ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో నమ్మకం సడలినట్లు కనిపిస్తోంది. ఈ వివాదం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపింది. తొలి రోజు కేవలం 11.05 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ‘లాల్ సింగ్ చద్దా’ (11.7 కోట్లు) రికార్డును కూడా అధిగమించలేకపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *