Orion Technical College

తక్కువ ఫీజులతో F1 అడ్మిషన్స్, కాలేజీ ట్రాన్స్ఫర్స్, CPT ప్రోగ్రామ్స్ అందిస్తున్న Davenport, Iowa లోని Orion Technical College

Orion Technical College: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ముఖ్యంగా మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులు F1 వీసాపై వస్తుంటారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండటం, జీవన ప్రమాణాలు ఆశాజనకంగా ఉండటం వంటి కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారు.

అయితే, అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకం వారు కొత్తగా F1 వీసా పొంది (F1 Admission) అమెరికాకు వచ్చే విద్యార్థులు. రెండవ రకం వారు అమెరికాకు వచ్చాక కాలేజీ నచ్చకపోవడం లేదా ఫీజులు, CPT లభ్యత వంటి కారణాల వల్ల మరొక కాలేజీకి బదిలీ (University Transfer) అయ్యేవారు. ఇక మూడవ రకం వారు ఒక మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగ జీవితంలో భాగంగా H1B వీసా రాకపోయినా లేదా రిజెక్ట్ అయినా , చట్టబద్ధంగా అమెరికాలో ఉండటానికి వీసా స్థితిని (Immigration Status) కొనసాగించడానికి మరొక మాస్టర్స్ డిగ్రీలో చేరుతుంటారు.  ఈ మూడవ రకం విద్యార్థులు మొదటి రెండు రకాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటారు.

Orion Technical College: ఈ విధంగా అన్ని రకాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అమెరికాలోని అయోవా రాష్ట్రం, డావెన్‌పోర్ట్ నగరంలో ఉన్న ఒరియన్ టెక్నికల్ కాలేజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కళాశాలలో పాఠ్యాంశాల్లో భాగంగా CPT (Curricular Practical Training) ప్రోగ్రామ్‌లు ఉండటం, అలాగే ఫీజులు మరియు జీవన వ్యయం అందుబాటులో ఉండటం వంటి అనేక కారణాలున్నాయి.

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), బిజినెస్ అనలిటిక్స్ (Business Analytics) , కంప్యూటర్ సైన్స్ (Computer Science) వంటి ఆధునిక సాంకేతిక రంగాలలో నైపుణ్యం సాధించేలా మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ఒరియన్ టెక్నికల్ కాలేజీలో అందుబాటులో ఉండటం ఒక ముఖ్యమైన కారణం.

Orion Technical College: ఈ కళాశాల ACCSC (Accrediting Commission of Career Schools and Colleges) గుర్తింపు కలిగి ఉండటం, ఎటువంటి విరామం లేకుండా 9 కోర్సులు,  ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే దాదాపు 20 నెలల్లోనే మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసే అవకాశం ఉండటం, ఇతర కళాశాలల నుండి కోర్సు క్రెడిట్‌లను బదిలీ చేసుకునే సౌలభ్యం అలాగే,  అనుకూలమైన ఫీజు చెల్లింపు ఎంపికలు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ALSO READ  KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలన కరవును తెచ్చింది..

మొదటి సెమిస్టర్ నుంచే CPT లభ్యత, విద్యార్థులకు అకడమిక్ సలహాలు, రెజ్యూమె అభివృద్ధికి సహాయం వంటి సేవలు, ఆన్‌లైన్ మరియు ప్రత్యక్ష కోర్సుల కలయికతో హైబ్రిడ్ ప్రోగ్రామ్‌లు, స్కాలర్‌షిప్‌లు, లోన్‌లు,  గ్రాంట్స్ సహాయక కార్యక్రమాలు ఒరియన్ టెక్నికల్ కాలేజ్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. 

తదుపరి సెమిస్టర్ 2025 మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం www.orion.edu ని సందర్శించండి. బ్రోచర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *