Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై మరో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యాలు చేయడాన్ని రాజయ్య ఖండించారు. కేసీఆర్, కేటీఆర్‌పై కడియం రెచ్చిపోయి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుండగా, తాజాగా కేసీఆర్ కుటుంబంపై కడియం వ్యాఖ్యలపై మరోసారి వారి మధ్య వైరం భగ్గుమన్నది.
Thatikonda Rajaiah: కేసీఆర్ కుటుంబంపై కడియం శ్రీహరి వ్యాఖ్యలు సిగ్గుచేటని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. తిన్నింటి వాసాలను లెక్కబెట్టే సంస్కృతి నీది.. అని విమర్శించారు. కడియం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లోని రోడ్లపై తిరగనివ్వరని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీపై మాట్లాడే అర్హత కడియంకు లేదని చెప్పారు. ఓట్లేసిన రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కడియంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కడియం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.