Deva: బాలీవుడ్ ప్రామిసింగ్ హీరో షహీద్ కపూర్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘దేవా’. ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దీనిని తెరకెక్కించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ‘దేవా’ సినిమా నిజానికి 2024 దసరా కానుకగా రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో 2025 ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. అయితే… ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మూవీని జనవరి 31నే రిలీజ్ చేస్తున్నారు. అంటే రెండు వారాల ముందే ‘దేవా’ గా షహీద్ కపూర్ తన అభిమానులను అలరించబోతున్నాడన్న మాట. ఇందులో షహీద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండటం విశేషం. సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కె.ఆర్. బన్సాల్ నిర్మించిన ఈ సినిమా జీ స్టూడియోస్ సంస్థ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తోంది.