Pushpa 2: ‘పుష్ప-2’ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారు? అనే విషయంలో ఆసక్తికరమైన కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆర్.ఆర్.లో తాను కొంత మేరకు భాగస్వామినయ్యానని తమన్ ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పారు. తనతో పాటు మరికొందరు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారని అన్నారు. అయితే సోమవారం హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ‘మూవీ క్లయిమాక్స్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్.ఆర్. గొప్పగా ఉంద’ని అన్నారు. దీనికి కొద్ది వారాల ముందు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశామని, అదిరిపోయిందని దేవివ్రీ ప్రసాద్ చెప్పారు. అంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లోనూ కొన్ని కీలక సన్నివేశాలకు ఆర్.ఆర్. ఇచ్చారని అర్థమౌతోంది. అయితే తాజాగా ‘పుష్ఫ-2’ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ చేసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ సామ్ సీఎస్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అసలు ‘పుష్ప-2’కి ఎవరెవరు ఆర్.ఆర్. ఇచ్చారనే విషయంలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో దేవిశ్రీ ప్రసాద్ పేరుకు మ్యూజిక్ అండ్ సౌండ్ సూజర్ విజన్ అని పడిందని, సామ్ సీ.ఎస్. కు ఆర్.ఆర్. అని పడిందని తెలుస్తోంది. మరి తమన్ క్రెడిట్స్ ఏమైనట్టు!?

