TGSRTC Recruitment 2025: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్ఆర్టీసీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 1000 డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ (హమాలీ) 743 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 8, 2025 నుంచి ప్రారంభమై అక్టోబర్ 28, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Election Commission: ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం..
డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, శ్రామిక్ పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. సాధారణంగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వ్రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ వంటి ప్రక్రియల ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం మరియు ఇతర సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ లేదా తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్సైట్ను చూడండి.