TGSRTC: తెలంగాణలో బస్సు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించేలా టీజీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు చిల్లర సమస్యతో ప్రయాణికులు, కండక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, దీనికి పరిష్కారంగా సిటీ బస్సుల్లో యూపీఐ పేమెంట్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే ఏసీ, స్లీపర్ బస్సుల్లో యూపీఐ ద్వారా టికెట్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించిన ఆర్టీసీ, ఇప్పుడు నగరంలోని సాధారణ బస్సుల్లోనూ ఈ సదుపాయాన్ని అందించనుంది. ప్రయాణికులు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, యూపీఐ ద్వారా టికెట్ ధరను చెల్లించేందుకు వీలుగా ప్రతి బస్సులో సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Crime News: వివాహిత అనుమానాస్పద మృతి.. సినీ ఫక్కీలో మలుపులు
TGSRTC: ఈ నిర్ణయంతో ప్రయాణ అనుభవం మరింత సులభతరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై చిల్లర సమస్యలతో ప్రయాణికులు, కండక్టర్లు వాదోపవాదాలకు దిగాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికుల సౌలభ్యం కోసం త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.