TGSRTC: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తులకు గడవు ఇచ్చింది. ఈ రోజు (అక్టోబర్ 8) నుంచే దరఖాస్తుల ప్రక్రియను సంస్థ ప్రారంభించింది. దీంతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. కావాల్సిన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకొని ఉన్నారు.
TGSRTC: టీజీఎస్ ఆర్టీసీలో 1743 ఉద్యోగాల భర్తీకి సంస్థ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఇదే నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాల్లో 1,000 మంది డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల వయసు వరకు ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
TGSRTC: అదే విధంగా శ్రామిక్ ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ క్యాటగిరీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు సడలింపు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం www.tgprb.in అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. చాలా ఏళ్ల తర్వాత టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.