Telangana Government

Telangana Government: కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

Telangana Government: జమ్ము & కశ్మీర్ ప్రాంతంలో తలెత్తిన సవాళ్ల మధ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్యాటకులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే పనిలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం కశ్మీర్‌లో చిక్కుకుపోయిన పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టూరిస్టులకు ఎలాంటి అపాయమైనా జరిగినపుడు వెంటనే స్పందించేందుకు ఈ హెల్ప్ డెస్క్ నిమిషానికోసారి అప్డేట్ అవుతూ పని చేస్తోంది.

పర్యాటకుల వివరాలు ప్రభుత్వానికి త్వరగా అందిస్తే, వారి స్థితిగతులపై సమర్థవంతమైన పర్యవేక్షణ చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టూర్ ఆపరేటర్లు మరియు ట్రావెల్ ఏజెంట్లను పిలుపునిస్తూ, ఇటీవల జమ్ము కశ్మీర్ వెళ్లిన వారి వివరాలను వెంటనే పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Pahalgam Attack: మా అన్న‌ను చంపిన ఉన్మాది త‌ల న‌ర‌కి తేవాలి.. లెఫ్టినెంట్ విన‌య్ న‌ర్వాల్ చెల్లి

తెలంగాణ భవన్, ఢిల్లీ అధికారులు కేంద్ర ప్రభుత్వం, ఇతర సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట పర్యాటకులకు సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

అలాగే, పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సన్నిహితుల వివరాలు ఈ క్రింది హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు:

📞 హెల్ప్ లైన్ నంబర్లు:

:9440816071
: 9010659333
: 040 23450368

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *