Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు.. అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు

Revanth Reddy: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల పరిస్థితిని సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య సూచనలు చేశారు:

  • మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు.

  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, వర్షాలు ఎక్కువగా పడే జిల్లాలకు ముందే సిబ్బందిని తరలించాలి.

  • రెడ్‌ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో సీనియర్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించాలి.

  • హెలికాప్టర్లు ఎయిర్‌లిఫ్టింగ్‌ కోసం సిద్ధంగా ఉంచాలి.

  • విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజ్‌ సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.

  • ట్రాఫిక్‌ నియంత్రణ కోసం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండాలి.

  • ప్రజలకు వర్షాలపై సమాచారం మీడియా ద్వారా చేరవేయాలి.

  • వరదలపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి.

  • హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా ప్రత్యేకంగా పర్యవేక్షించాలి.

  • భారీ వర్షాల సమయంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి.

సమీక్షలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, అలాగే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకుండా పూర్తి అప్రమత్తత పాటించాలని ఆదేశించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *