Test match: ఢిల్లీ (Arun Jaitley Stadium) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. వెస్టిండీస్‌పై ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మొదటి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు కేవలం 248 పరుగులకే ఆలౌట్ కాగా, ఫాలోఆన్ ఆడిన రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు మట్టికరిపింది. దీంతో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం ఉంచింది.
విండీస్ తరఫున కాంప్‌బెల్ (115), షై హోప్ (103) అద్భుత శతకాలు సాధించారు. అదనంగా రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32), జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) కొంత ప్రతిఘటన చూపినప్పటికీ, భారత బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయారు.
భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా చెరో 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో 1 వికెట్ తీసి విండీస్‌ను కట్టడి చేశారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసి భారీ ఆధిక్యం సాధించింది.
తదుపరి 121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే ఒక షాక్‌కి గురైంది.
యశస్వీ జైస్వాల్ (8 పరుగులు, 7 బంతులు) వారికాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ కాగా, మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ (5 పరుగులు, 7 బంతులు), సాయి సుదర్శన్ (0) క్రీజ్‌లో నిలిచారు.
ఇక మరో 108 పరుగులు చేస్తే భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయనుంది.