Test match: ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ రెండో రోజు గిల్ తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీకి ఆయన 311 బంతులు ఆడాడు.
ఈ సందర్భంగా గిల్ రెండు అరుదైన ఘనతలు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గానే కాకుండా, తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా గుర్తింపు పొందాడు.
గిల్ ద్వారా మరో రికార్డు కూడా బద్దలైంది. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 1979లో ది ఓవల్ వేదికగా 221 పరుగులు చేసిన సునీల్ గావస్కర్ పేరిట ఉండేది. 2002లో అదే మైదానంలో రాహుల్ ద్రావిడ్ 217 పరుగులు చేశాడు. గిల్ వీరిద్దరినీ అధిగమించి భారత క్రికెట్ చరిత్రలో కొత్త శిఖరాన్ని అధిరోహించాడు.