Karnataka: కర్ణాటక రాష్ట్రంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లా కమల్‌పురా సమీపంలో రోడ్డుపై ఎదురెదురుగా వచ్చి కారు, బొలేరో వాహనాలు ఢీకొన్నాయి.
Karnataka: హైదరాబాద్ వాసులు అదే రాష్ట్రంలోని గనగాపురంలోని దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

