Telugu Language: దేశంలోకెళ్ల తెలుగు మాట్లాడే వారి సంఖ్య ప్రబలంగానే ఉన్నది. హిందీ ప్రాంతీయ భాషల్లో తమిళంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి తెలుగు భాషకు పంజాబ్ రాష్ట్రంలో గౌరవం దక్కింది. అక్కడి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలుగు భాషను నాలుగో భాషగా బోధించాలని నిర్ణయించింది.
Telugu Language: మే నెల 26వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అక్కడి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలను నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు కొత్త భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలను పొందడంలో సహాయపడేందుకు ఈ తరగతులను నిర్వహించనున్నది. ఈ వేసవి శిబిరాల్లో తెలుగు భాషపై విద్యార్థులకు బోధించనున్నారు.
Telugu Language: పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ఈ వేసవి శిబిరాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొంటారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి రోజూ మూడు గంటల పాటు తెలుగు బోధించాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది.
Telugu Language: తెలుగును నాలుగో భాషగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ (డీటీఎఫ్) వ్యతిరేకిస్తున్నది. ఆ రాష్ట్రంలో పంజాబీని మాతృభాషగా కలిగి ఉన్నప్పటికీ, 12వ తరగతిలో 3,800 మందికిపైగా, 10వ తరగతిలో 1,571 మంది విద్యార్థులు జనరల్ పంజాబీలో మొదటి భాషగా ఉత్తీర్ణులు కాలేదు. దీన్ని సాకుగా చూపుతూ మూడు భాషల విధానాన్ని విచ్ఛిన్నం చేస్తూ తెలుగును నాలుగో భాషగా ప్రవేశపెట్టాలన్ని ప్రభుత్వ యోచనను డీటీఎఫ్ తప్పుపడుతున్నది. ఏదేమైనా ఓ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా బోధనను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టడంపై తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.