Dekhlenge Saala Song

Dekhlenge Saala Song: రంపంపం రంపంపం.. పవన్ కల్యాణ్ ఎనర్జీకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Dekhlenge Saala Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌‌’. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ పాటను శనివారం విడుదల చేశారు. రాజమండ్రిలో అభిమానుల సమక్షంలో నిర్వహించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో ఈ పాటను రిలీజ్ చేశారు.

పవన్ స్టైలిష్ స్టెప్స్.. దేవిశ్రీ మార్క్ బీట్!

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించగా, సింగర్ విశాల్ దడ్లాని తన ఎనర్జిటిక్ వాయిస్‌తో ఆలపించాడు.

‘రంపంపం రంపంపం రపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. ధమ్ ధమ్.. రిథమ్ ధమ్.. ఫ్లోర్ మీద హోరు గాలి రప్పిద్దాం.. బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. టగ్ ఆఫ్ వారే జరుగుతున్నా.. దేఖ్‌‌లేంగే సాలా.. చూసినాంలే చాలా..’ అంటూ సాగిన ఈ పాట ఊపు అందుకుంది.

ఇది కూడా చదవండి: Murder: పహాడీ షరీఫ్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

ఈ పాటలో పవన్ కళ్యాణ్ మాస్ స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తూ, తన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్‌‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ మాస్ బీట్, పవన్ స్వాగ్ కలవడంతో ఈ పాట చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

‘మనల్ని ఎవడ్రా ఆపేది’ స్ఫూర్తితోనే ఈ పాట: చిత్ర యూనిట్

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా అభిమానులందరూ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “జీవితంలో సమస్యలు రావడం సహజం. అప్పుడు మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా? అదే ఈ పాట.” అని చెప్పారు.

గీత రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ డైలాగ్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాటకు సాహిత్యం రాశానని తెలిపారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “ఇది ఆరంభం మాత్రమే. ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి కంటెంట్ ఈ స్థాయిలోనే ఉంటుంది.” అని చెప్పి సినిమాపై అంచనాలను మరింత పెంచారు. మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ మొదటి పాట సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *