sivakarthikeyan

Sivakarthikeyan: తెలుగువారిని ఆకట్టుకుంటున్న శివకార్తికేయన్!

Sivakarthikeyan: తెలుగు నాట తమిళ హీరోల చిత్రాలకు బ్రహ్మరథం పట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు కొన్ని తమిళనాడులో కంటే ఇక్కడే బాగా ఆడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో ఆ స్టార్ హీరోలు సైతం తమ చిత్రాల ప్రమోషన్స్ విషయంలో తమిళనాడు కంటే… తెలుగు రాష్ట్రాలకే ప్రాధన్యమిచ్చారు. అలా ఇక్కడ వచ్చిన క్రేజ్ కారణంగా స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించే ప్రయత్నమూ చేశారు. స్టార్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో నటించలేదు కానీ కమల్ హాసన్ ఏ మాత్రం అవకాశం లభించినా స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి, నటుడిగా మంచి మార్కులు పొందడమే కాదు… తన తమిళ డబ్బింగ్ చిత్రాల మార్కెట్ నూ విస్తరించుకునే ప్రయత్నం చేశాడు.

ఇది కూడా చదవండి: Adivi Sesh: బ్రాండింగ్ బిజీలో అడవి శేష్!

తెలుగు నాట తమిళ హీరోల చిత్రాలకు బ్రహ్మరథం పట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు కొన్ని తమిళనాడులో కంటే ఇక్కడే బాగా ఆడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో ఆ స్టార్ హీరోలు సైతం తమ చిత్రాల ప్రమోషన్స్ విషయంలో తమిళనాడు కంటే… తెలుగు రాష్ట్రాలకే ప్రాధన్యమిచ్చారు. అలా ఇక్కడ వచ్చిన క్రేజ్ కారణంగా స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించే ప్రయత్నమూ చేశారు. స్టార్ అయిన తర్వాత రజనీకాంత్ తెలుగులో నటించలేదు కానీ కమల్ హాసన్ ఏ మాత్రం అవకాశం లభించినా స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి, నటుడిగా మంచి మార్కులు పొందడమే కాదు… తన తమిళ డబ్బింగ్ చిత్రాల మార్కెట్ నూ విస్తరించుకునే ప్రయత్నం చేశాడు.

Sivakarthikeyan: రజనీకాంత్ అంటే తెలుగువారికి మొదటి నుండి అభిమానమే. అతని సినిమా వచ్చిందంటే అది స్ట్రయిటా… డబ్బింగా అనేది ఎప్పుడూ చూడరు. రజనీ స్టైల్ కు పడిపోయి… అతని సినిమాలను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నారు. అందుకే రజనీకాంత్ తన ప్రతి తమిళ చిత్రం తెలుగువారి ముందుకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ స్థాయిలోనే ఆయనకు విజయాలు దక్కాయి. ఈ యేడాది వచ్చిన ‘లాల్ సలామ్’ ఫ్లాప్ అయినా… ‘వేట్టయన్’ ఫర్వాలేదనిపించింది. ఇక ‘జైలర్’ తమిళంలో మాదిరే ఇక్కడా మంచి విజయాన్ని కైవసం చేసుకుంది.

రజనీ, కమల్ హాసన్ తర్వాత తెలుగువారికి చేరువైన తమిళ కథానాయకులు విజయ్, అజిత్, సూర్య, కార్తి… కానీ అన్నదమ్ములయిన సూర్య, కార్తి సినిమాలకు దక్కినంత కమర్షియల్ సక్సెస్ తెలుగులో విజయ్, అజిత్ కు దక్కలేదు. కాకపోతే… ఈ అన్నదమ్ముల్లోనూ కార్తీ అంటే తెలుగువారికి ఎక్కువ అభిమానం. అతని సినిమాలను మొదటి నుండి బాగానే ఆదరిస్తూ వచ్చారు. తెలుగువారి మీద ఉన్న అభిమానంతో సూర్య ‘రక్తచరిత్ర’లో నటిస్తే.. కార్తీ ‘ఊపిరి’లో కీ-రోల్ ప్లే చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో అటు సూర్య , ఇటు కార్తీ సినిమాలు కమర్షియల్ గా పెద్దంతగా పే చేయడం లేదు.

ALSO READ  NTR: ఎన్టీఆర్ సినీ జీవితానికి 75 ఏళ్లు.. 14న విజ‌య‌వాడ‌లో వ‌జ్రోత్స‌వాలు

అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరిగే వార్ ఇంతా అంతా కాదు. ఒకరి సినిమా విడుదలైతే మరొకరి ఫ్యాన్స్ దానిని ట్రోల్ చేస్తుంటారు. అలాంటి సమస్య తెలుగునాట వీరిద్దరికీ ఎప్పుడూ రాలేదు. వీరి సినిమాలు అన్నీ సక్సెస్ కాకపోయినా… చాలా వరకూ ఫర్వాలేదనిపించాయి. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఈ మధ్య కాలంలో సాలీడ్ హిట్స్ తెలుగులో లభించలేదు.

Sivakarthikeyan: ఇదే సమయంలో ధనుష్, విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి వారు తమ డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య విజయ్ సేతుపతి సినిమాలు వరుసగా తెలుగులో పరాజయం పాలయ్యాయి. అటువంటి టైమ్ లో వచ్చిన ‘మహారాజ’ మంచి విజయాన్ని అందుకుని అతని తెలుగు అభిమానులలో ఉత్సాహం నింపింది. ఇక విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’ తర్వాత మళ్ళీ అంతటి సాలీడ్ హిట్ దక్కలేదు. ధనుష్ డబ్బింగ్ సినిమాల ద్వారా భారీ విజయాన్ని అందుకోక పోయినా ‘సార్’ సినిమాతో సాలీడ్ హిట్ అందుకోవడమే కాదు నాగార్జునతో కలసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’లో నటిస్తున్నాడు. ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే… రాబోయే రోజుల్లో అతనే తెలుగులో నిలదొక్కుకునే తమిళ స్టార్ హీరో అనిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా శివ కార్తికేయన్ మూవీస్ తెలుగులో విడుదలై విజయాన్ని సాధించాయి. అలా అతనికి తెలుగులో మొదటి హిట్ ‘రెమో’ రూపంలో దక్కింది.

‘రెమో’ మూవీ డీసెంట్ హిట్ కావడంతో డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు శివ కార్తికేయన్ మూవీస్ పై దృష్టి పెట్టారు. అలా ఆ తర్వాత వచ్చిన శివ కార్తికేయన్ సినిమాలు ‘డాక్టర్, డాన్’ మంచి విజయాన్ని అందుకున్నాయి. విశేషం ఏమంటే… ఈ సినిమాలను ఓటీటీలోనూ తెలుగువారు బాగా ఆదరించారు. చిన్నపాటి సందేశంతో పాటు వినోదాన్ని అందించడంలో శివ కార్తికేయన్ ముందుంటాడు. పైగా అతని సినిమాల్లో ఎటువంటి హడావుడీ కనిపించదు. స్వీట్ అండ్ సింపుల్ గా ఉంటాయి. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ‘ప్రిన్స్’, ఆ తర్వాత వచ్చిన ‘అయలాన్’ పెద్దంత ఆడలేదు కానీ దానికి ముందొచ్చిన సినిమాలు బాగా పే చేశాయి.

Sivakarthikeyan: తాజాగా దీపావళికి వచ్చిన ‘అమరన్’తో శివ కార్తికేయన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ ముకుంద వరద రాజన్ గా వెండితెరపై అద్భుతమైన నటన కనబరిచాడు శివ కార్తికేయన్. అలానే అతనితో జోడీ కట్టిన సాయి పల్లవి సైతం తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది. కమల్ హాసన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాను తెలుగులో సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. ‘అమరన్’ తమిళనాడులోనే కాదు… తెలుగు నాట కూడా మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఈ మధ్య వచ్చిన తమిళ అనువాద చిత్రాలలో మేటిగా ‘అమరన్’ నిలవడం విశేషం అనే చెప్పాలి. శివ కార్తికేయన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తమిళనాట అగ్ర స్థానానికి చేరువ అవుతుండటమే కాదు తెలుగువారినీ ఆకట్టుకోవడంలో ముందున్నాడు. మరి మిగతా స్టార్స్ లాగే శివకార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేస్తాడో చూద్దాం.

ALSO READ  Shamshabad Airport:  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *