Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఇగం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో 9 లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో గజగజ వణుకుతున్నారు. మరో 5 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలలోపు నమోదు కావడం మరింత ఆందోళనకరం.
Telangana: వచ్చే మూడు రోజులు అంటూ డిసెంబర్ 13 నుంచి 16 వరకు కూడా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో నిన్న కనిష్ణ ఉష్ణోగ్రత 5.8గా నమోదైంది. దీంతో ఆ గ్రామ పరిధిలో జనం చలితో వణికి పోతున్నారు. పరిసర గ్రామాల్లోనూ ఇదే తీరుగా చలి చంపుతున్నది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం.
Telangana: రాష్ట్రంలో ముఖ్యంగా సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్నది. పొడి గాలి, బలంగా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెద్దలు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఈ వాతావరణం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వ్యాధులు తిరగదోడి అవస్థలు పడుతున్నారు.

