Telangana: తనను కించపరిచేలా పోస్టు పెట్టినందుకు ఓజీ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తాను నోటీసులు పంపుతున్నట్టు పిటిషనర్ మల్లేశ్ యాదవ్ వెల్లడించారు. ఈ రోజు (సెప్టెంబర్ 28) హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
Telangana: ఓజీ టికెట్ ధరల గురించి ఇదే మల్లేశ్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు రాత్రి 11.30 గంటలకు వస్తే, అంతకు ముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఓ అభ్యంతరకర పోస్టు పెట్టిందని మల్లేశ్ యాదవ్ ఆరోపించారు. నైజాం ఏరియాలో ఎక్కడైనా మల్లేశ్యాదవ్కు రూ.100కే టికెట్ ఇస్తామంటూ తనను కించపరిచేలా పోస్టు పెట్టారని ఆరోపించారు.
Telangana: రాజ్యంగపరంగా తాను పిటిషన్ వేసినందుకు తనను కించపరుస్తూ పోస్టు పెట్టి, ట్రోల్స్ చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. కించపరిచేలా పోస్టు పెట్టిన సంస్థకు తాను లీగల్ నోటీసులు పంపిస్తానని తెలిపారు. అదే విధంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నానని కూడా మల్లేశ్‌యాదవ్ తెలిపారు.