Telangana:

Telangana: ఓజీ సినిమా నిర్మాణ సంస్థ‌కు షాక్‌!

Telangana: త‌న‌ను కించ‌ప‌రిచేలా పోస్టు పెట్టినందుకు ఓజీ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌కు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తాను నోటీసులు పంపుతున్న‌ట్టు పిటిష‌న‌ర్ మ‌ల్లేశ్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఈ రోజు (సెప్టెంబ‌ర్ 28) హైద‌రాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యం వెల్ల‌డించారు.

Telangana: ఓజీ టికెట్ ధ‌ర‌ల గురించి ఇదే మ‌ల్లేశ్ యాద‌వ్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు రాత్రి 11.30 గంట‌ల‌కు వ‌స్తే, అంత‌కు ముందే డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ త‌మ అఫీషియ‌ల్ ఎక్స్ ఖాతాలో ఓ అభ్యంత‌రక‌ర పోస్టు పెట్టింద‌ని మ‌ల్లేశ్ యాద‌వ్ ఆరోపించారు. నైజాం ఏరియాలో ఎక్క‌డైనా మ‌ల్లేశ్‌యాద‌వ్‌కు రూ.100కే టికెట్ ఇస్తామంటూ త‌న‌ను కించ‌ప‌రిచేలా పోస్టు పెట్టార‌ని ఆరోపించారు.

Telangana: రాజ్యంగ‌ప‌రంగా తాను పిటిష‌న్ వేసినందుకు త‌న‌ను కించ‌ప‌రుస్తూ పోస్టు పెట్టి, ట్రోల్స్ చేయించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మని తెలిపారు. కించ‌ప‌రిచేలా పోస్టు పెట్టిన సంస్థ‌కు తాను లీగ‌ల్ నోటీసులు పంపిస్తాన‌ని తెలిపారు. అదే విధంగా క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేస్తున్నాన‌ని కూడా మ‌ల్లేశ్‌యాద‌వ్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *