Telangana Politics: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై శాసనమండలి చైర్మన్, ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ అయినప్పటికీ తనకు జిల్లాలో కనీస మర్యాద దక్కడం లేదని గుత్తా ఆవేదనతో ఉన్నారని తెలుస్తున్నది. మంత్రులతోపాటు జిల్లా అధికారులు కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Telangana Politics: గతంలో తన ఎమ్మెల్సీ కోటా కింద రూ.4 కోట్ల నిధులను జిల్లాలో వివిధ ప్రాంతాలకు గుత్తా సుఖేందర్‌రెడ్డి కేటాయించారు. ప్రతిపాదనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. కలెక్టర్ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. ఆ మేరకు వివిధ నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనులు కూడా మొదలయ్యాయి.
Telangana Politics: ఈ దశలో ఆయా పనుల ఆర్డర్లను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులను జారీచేయడంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి భగ్గుమన్నారు. ఓ మంత్రి ఆదేశాలతోనే కలెక్టర్ రద్దు చేశారని గుత్తా అనుమానం. దీంతో మనస్తాపంతో అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్‌కు సభా హక్కుల నోటీసులు ఇప్పించగా, జిల్లాకు చెందిన ఓ మంత్రి జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్టు సమాచారం.
Telangana Politics: ఆ తర్వాత నుంచి జిల్లాలో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ తనను పిలువడం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదనతో రగిలిపోతున్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో తనకు ఆహ్వానం ఉండటం లేదని, కలెక్టర్, అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

