Telangana: పదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ అధికార పార్టీ అరోపణలు… అధికారంలో ఉన్నారుగా విచారణ జరుపుకోండి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయంటూ ప్రతిపక్షం సవాల్… తీరా విచారణకు ఆదేశించడంతో రాజకీయ కుట్ర… కక్షసాధింపు అంటూ ప్రచారం… ప్రస్తుతానికి తెలంగాణలో ఇలాంటి రాజకీయమే నడుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి… ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం ఇది.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని… అందుకే మేడిగడ్డ కుంగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు… ఎలాంటి అక్రమాలు జరగలేదు… అధికారంలో మీరే ఉన్నారుగా విచారణ జరుపుకోండి నిజాలు బయటకు వస్తామని బిఆర్‌ఎస్ నేతల సవాల్.. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతోందని విమర్శలు. విద్యుత్ కొనగుళ్లపై
అక్రమాలు జరిగాయాంటూ అధికార పక్షం ఆరోపణలు చేయడమే ఆలస్యం… ఏ విచారణకైనా సిధ్దమని ప్రతిసవాల్ చేసిన ప్రధాన ప్రతిపక్షం… ఆపై ప్రభుత్వం విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతొందని గగ్గోలు…
ఇది కూడా చదవండి: Manchu Vishnu: ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది
Telangana: అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవకతవకలు జరిగాయని సర్కార్ ఆరోపిస్తుంటే…. ఎంక్వైరీ జరపాలని గులాబి నేతల సవాల్… తీరా ఎంక్వైరీకి ఆదేశిస్తే… తాము టెండర్లు రద్దు చేయాలంటే ఎంక్వైరీలు ఎందుకంటూ నిలదీత… ఈ ఫార్ములా రేస్ లో అక్రమాలు జరిగాయని… నిబంధనలు పాటించలేదని పాలకపక్షం ఆరోపిస్తుంటే…. ఎక్కడ అవినీతి జరగలేదు అంతా సక్రమమే… ఏ విచారణ జరిపినా సిద్దమంటూ సవాల్ విసిరారు బిఆర్‌ఎస్ నేత కేటీఆర్… తీరా ఏసీబీ రంగంలోకి దిగగానే.. కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తప్పులు చేయకుంటే విచారణలు ఎదుర్కొవాడానికి ప్రధాన ప్రతిపక్ష నేతలకు ఎందుకంత భయమని పాలకపక్షం ప్రశ్నింస్తుంటే… రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది.ఇదంతా చూస్తున్న జనం మాత్రం… సవాల్ చేయడం ఎందుకు విచారణ అంటే సైలెంట్ అవ్వడం
దేనికని.. నవ్వుకుంటున్నారు.