AP news: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆరోజు లాస్ట్ డేట్

AP news: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువును మరోసారి పొడిగించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు డిసెంబర్ 24 చివరి గడువుగా ప్రకటించింది.

ఇకపై ఫీజు చెల్లింపుకు ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. అయితే, ఈ గడువు ముగిసిన తర్వాత, డిసెంబర్ 31 వరకు తత్కాల్ పథకం ద్వారా అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంలో ఫీజు చెల్లించేందుకు గతంలో అవకాశం పొందని విద్యార్థులు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా రూ.3,000 చొప్పున చెల్లించాలని సూచించారు.

పరీక్ష తేదీలు:

ఇంటర్ ఫస్ట్ ఇయర్: మార్చి 1 నుండి 19 వరకు

ఇంటర్ సెకండ్ ఇయర్: మార్చి 3 నుండి 20 వరకు

రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిలైన ప్రైవేట్ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rain Alert: ఏపీలో వచ్చే వారమంతా వర్షాలు.. జాగ్రత్తలు తప్పనిసరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *