Telangana News: ఆ యువకుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని సాకుతున్నారు. తమలాగా తమ కుమారుడు కూలి పనులు చేయొద్దని భావించిన ఆ నిరుపేద దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించారు. ఎందుకో కానీ ఆ యువకుడికి కారు కొనాలని కోరిక కలిగింది. ఏకంగా బీఎండబ్లూ కారు కొనాలని మంకుపట్టు పట్టాడు. చివరకి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి..
Telangana News: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో బొమ్మ కనకయ్య, కనకమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు జానీ (21) పదో తరగతి వరకు చదివి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. అతనికి కారు కొనాలన్న కోరిక కలిగింది. మరి అలాంటి ఇలాంటి కారు కోరుకోలేదు. ఏకంగా బీఎండబ్లూ కారే కొనాలని నిర్ణయంచుకున్నాడు. తల్లిదండ్రుల వద్ద కారు కొనాలని మంకుపట్టే పట్టాడు.
Telangana News: కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ నిరుపేద దంపతులు అప్పు సప్పు చేసైనా తమ కొడుకు కోరికను తీర్చాలని భావించారు. తన కొడుకు కోరుకున్నట్టు బీఎండబ్ల్యూ కారు కొనేందుకు వివరాలు తెలుసుకున్నారు. భారీ ధర ఉంటుందని తెలిసి జడుసుకున్నారు. అంత మొత్తం ఖర్చు పెట్టే స్థోమతలేని ఆ దంపతులు.. కొడుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Telangana News: అయినా తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా జానీ ససేమిరా అన్నాడు. ఎలాగైనా తన కొడుకును చిన్నబుచ్చవద్దని భావించిన ఆ నిరుపేద కుటుంబం.. మరో కారు కొందామని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు వారు కారును కొనిద్దామని సిద్దిపేటలోని మారుతీ కారు షోరూంకు తమ కొడుకును తీసుకెళ్లారు. మారుతీ స్విప్ట్ కారు కొనిస్తామని స్వయంగా చూపించారు. కానీ, వారి కొడుకుకు ఆ కారు నచ్చలేదు.
Telangana News: ఖాళీగా తిరిగొచ్చారు. బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని ఆ పేద దంపతులకు ఉన్నా.. అంత స్థోమత లేక కొడుకుకు అనునయించారు. అయితే తాను కోరుకున్న కారు కొనివ్వలేదని జానీ మనస్తాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృ తిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కలలు కనాలి.. కష్టపడి నెరవేర్చుకోవాలి.. కానీ, తల్లిదండ్రులను కాల్చుకు తినొద్దు.. అలివిగాని కోరికలు కోరొద్దని మానసిక విశ్లేషకులు యువతకు సూచిస్తున్నారు.