Telangana News: తేనెటీగల దాడిలో నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని ఆర్లగడ్డగూడెంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటనను మరువక ముందే పెద్దపల్లి జిల్లాలో 30 మందిపై తేనెటీగలు దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నది. తేనెటీగల గుంపు తీవ్రత గురించి, దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియకపోతే ఇలా వాటి బారిన పడి గాయాలపాలు కావాల్సి వస్తుంది. ఏమి చేస్తాయిలే అనుకుంటే మాత్రం అవి తమ ప్రతాపం చూపిస్తాయి.
Telangana News: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని జూనియర్ కళాశాల మైదానంలో పలువురు విద్యార్థులు కరాటే నేర్చుకునేందుకు వచ్చారు. వారిలో కొందరు వాకర్స్, క్రీడాకారులు కూడా ఉన్నారు. మైదానంలో ఎవరికి వారుగా తమ పనులు చేసుకుంటున్నారు. విద్యార్థులు గ్రూపుగా కరాటే శిక్షణ పొందుతుండగా, వాకర్స్ మైదానం చుట్టూ కలియ తిరుగుతుండగా, క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
Telangana News: ఇంతలోనే కరాటే నేర్చుకోవడానికి వచ్చిన ఓ బాలుడిపై తేనెటీగల గుంపు దాడి చేసింది. అదే సమయంలో ఏమైందో తెలుసుకొని ఆ బాలుడిని తేనెటీగల బారి నుంచి కాపాడేందుకు అక్కడివారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారందరిపై పెద్ద ఎత్తున ఉన్న తేనెటీగలు దాడి చేయసాగాయి.
Telangana News: కళాశాల మైదానంలో ఉరుకులు, పరుగులు.. వెంటపడి మరీ తేనెటీగలు తమ ప్రతాపం చూపుతున్నాయి. మైదానం చుట్టూ ఉన్న చెట్లపై తేనెటీగల స్థావరం ఉండి ఉండవచ్చని, వాటి నుంచే ఈ గుంపు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. తేనెటీగల దాడిలో సుమారు 30 మంది వరకు గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా, తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Telangana News: తేనెటీగల గుంపు దాడి చేసిన సమయంలో, లేదా గుంపు వచ్చే క్రమంలో చిన్న ట్రిక్స్ పాటిస్తే ఆ గుంపు బారి నుంచి రక్షణ పొందవచ్చు. అదేమిటంటే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చిన్నపాటి మంట పెడితే ఆ వేడికి, పొగకు తేనెటీగలు రాలేవని, మన ఆ మంట సమీపంలో ఉంటే వాటి నుంచి రక్షణ పొందవచ్చని పలువురు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని పెద్దపల్లి జూనియర్ కళాశాల ఆవరణలో ఘటన జరినప్పుడు పాటిస్తే ఇంత మందికి అంత పెద్ద గాయాలు అయి ఉండకపోవచ్చని అంటున్నారు.