Telangana Model Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ పాఠశాల విద్యాశాఖ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొన్నది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. దీనిపై వివరణాత్మక నోటిఫికేషన్ సోమవారం విడుదలవుతుందని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Telangana Model Schools: ఆరో తరగతిలో అన్ని సీట్లకు ప్రవేశాలు ఉంటాయని అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. 7 నుంచి 10వ తరగతి వరకు మాత్రం ఆయా స్కూళ్లలోని ఖాళీల ఆధారంగా భర్తీచేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ విద్యార్థులు రూ.125, ఇతరులు రూ.200 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్త ఇకలిగిన వారు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.