Chennai Super Kings: ఛాంపియన్స్ అంటే ఊరికే అయిపోరు, ఆక్షన్ డే రోజు పక్కా ప్రణాళికతో వచ్చారు.. ముంబై ఇండియన్స్ CSK ది సేమ్ పాలసీ. ఎవరిని కొనాలి, కొంటె ఎంత వరకు కొనొచ్చు, ఈ సీజన్ లో ఎవ్వరు ఫార్మ్ లో ఉన్నారు అనే పక్కా కాలిక్యులేషన్ తో రెడీ గా ఉన్నారు. ఈ ఆర్టికల్ లో మనం ఆక్షన్ డే రోజు ఎవరిని కొన్నారు ఇంతకు కొన్నారు వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటో తెలుసుకుందాం.
బ్యాటర్స్:
రుతురాజ్ గైక్వాడ్: 18 కోట్లు CSK కెప్టెన్ ఇతన్ని రిటన్షన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.
డెవన్ కాన్వే: 6 కోట్లు న్యూజిలాండ్ బ్యాటర్
షేక్ రషీద్ :30 లాక్స్ మన గుంటూరబ్బాయి
ఆండ్రే సిద్ధార్థ్ : 30 లాక్స్
రాహుల్ త్రిపాఠి : 3.40 కోట్లు KKR అండ్ CSK ఇతని కోసం పోటీ పడ్డాయి కానీ చివరిగా CSK ఇతన్ని దక్కించుకుంది
వికెట్ కీపర్స్:
వంశ్ బేడీ: 55 లాక్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కం వికెట్ కీపర్..MS ధోని :రిటన్షన్ పాలసీ లో భాగంగా 4 కోట్లు ఇచ్చారు వికెట్ల వెనుక ఉండి మ్యాచ్ ని గెలిపించడమే కాకుండా ఆక్షన్ డే రోజు బ్యాక్ ఎండ్ లో ఉండి మానేజ్మెంట్ ని నడిపిస్తుంటాడు.. CSK మానేజ్మెంట్ ప్రతిసారి పక్కా ప్లానింగ్ తో వస్తారు.. జెనరల్ గా ఐపీల్ మ్యాచెస్ లో 14 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో అంటే చెపాక్ స్టేడియం లో మిగిలిన 7 మ్యాచెస్ ‘అవివా స్టేడియం’’ లో ఆడతారు చెపాక్ స్టేడియం స్పిన్ కు పరేడ్ గ్రౌండ్ అంటే స్పిన్నర్లు కు బాగా అనుకూలంగా ఉంటుంది సో చెపాక్ స్టేడియం లో 7 మ్యాచెస్ లో 5 గెలిచి రిమైనింగ్ 7 మ్యాచెస్ లో 3 గెలిచినా చాలు టోటల్ గా 8 విన్నింగ్స్ వాళ్ళు ప్లే ఆఫ్ కి సింపుల్ గా క్వాలిఫై అవుతారు ప్రతిసారి టైం వాళ్ళది సేమ్ ఫార్ములా సేమ్ స్ట్రాటజీ సో ఈసారి కూడా వాళ్ళు అదే స్ట్రాటజీ తో స్పిన్నర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు స్పిన్నర్స్ ని ఎక్కువ తీసుకున్నారు మరి వాళ్ళు ఏ స్పిన్నర్స్ ని తీసుకున్నారో చూద్దాం..
ఇది కూడా చదవండి: Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ముంబైని కర్ణాటక ఎడ్జ్ దాటింది
స్పిన్నర్స్:
రవీంద్ర జడేజా రిటన్షన్ పాలసీ లో భాగంగా 18 కోట్లు కి తీసుకున్నారు బ్యాక్ టూద హోమ్ అన్నట్లు ఈసారి అశ్విన్ ని తీసుకొన్నారు 9.75 కోట్లు ఇతని కోసం LSG ,RCB, RR పోటీ పడ్డారు ఫైనల్ గా CSK చాలా అమౌంట్ పెట్టి తీసుకుంది రవిచంద్రన్ అశ్విన్ కి చెపాక్ స్టేడియం హోమ్ గ్రౌండ్ సో వికెట్ల వెనుక ధోని వికెట్ల ముందు అశ్విన్ మాయాజాలం చూడొచ్చు ఆఫ్ఘన్ ప్లేయర్ నూర్ అహ్మద్ ఇతన్ని 10 కోట్లు పెట్టి తీసుకొన్నారు లాస్ట్ టైం ఇతను గుజరాత్ టైటాన్స్ కి ఆడాడు ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్ 5కోట్లు RTM కార్డ్ ఉస్ చేసింది దాని పైన CSK వాళ్ళు 10 కోట్లు ఆఫర్ చేసి తీసుకున్నారు. నూర్ అహ్మద్ ప్రెస్ 10కోట్లు శ్రేయాస్ గోపాల్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఇతన్ని 30 లాక్స్ పెట్టి తీసుకున్నారు దీపక్ హుడా ఆల్ రౌండర్ 1.7 కోట్లు ఇతని కోసం SRH టీం కూడా పోటీ పడింది ఇతను లాస్ట్ టైం LSG కి ఆడాడు ఇలాంటి స్పిన్నర్స్ తో స్పిన్ పిచ్ మీద చెపాక్ స్టేడియం లో పైగా వికెట్ల వెనుకాల ధోని సలహాలతో ఎలాంటి టీం నైనా ఎలాంటి బాట్స్మన్ నైనా చెక్ పెట్టేస్తారు..
అల్ రౌండర్స్
శివమ్ దూబే 12 కోట్లు ఇతన్ని రిటన్షన్ పాలసీ లో తీసుకున్నారు సామ్ కరణ్ ఇంగ్లాండ్ ప్లేయర్ 2.4 కోట్లు ఇతన్ని లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్ 18.5 కోట్లు కి తీసుకున్నారు ఈసారి CSK టీం 2.4 కోట్లు కి చీప్ గా కొట్టేసింది ఇదైతే బెస్ట్ ప్రైస్ CSK కి.. విజయ్ శంకర్ 1.2 కోట్లు ఇతను లాస్ట్ టైం GT కి ఆడాడు అన్షుల్ కంబోజ్ 3.4 కోట్లు MI అండ్ CSK ఇతని కోసం పోటీ పడ్డాయి ఇతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రైట్ హ్యాండెడ్ బాట్స్మెన్ కూడా హార్డ్ హిట్టింగ్ చేయగల బాట్స్మెన్.. జమీ ఓవర్టన్ ఇంగ్లాండ్ ప్లేయర్ 1.5 కోట్లు ఇతను 6.5 హైట్ ఉంటాడు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అలాగే బాట్స్మెన్ కూడా కమలేష్ నాగర్కోటి ఇండియా అండర్ 19 కి ఆడాడు ఇతన్ని 30 లాక్స్ కి తీసుకున్నారు ఫస్ట్ ఆక్షన్ లో ఎవరు తీసుకోలేదు లాస్ట్ 2 సీజన్స్ లో ఇతను ఐపీల్ ఆడలేదు అతనికిది నెగిటివ్ పాయింట్ అయ్యిండొచ్చు బట్ CSK ఇతన్ని 30 లాక్స్ బేస్ ప్రైజ్ కి తీసుకోంది.. రామకృష్ణ గోష్ ఇతన్ని 30 లాక్స్ కి తీసుకొన్నారు రైట్ హ్యాండెడ్ బాట్స్మెన్ అలాగే రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం..
CSK టీం కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ బాట్స్మెన్ ఏ ప్లేస్ లో అయినా అడగలరు రాహుల్ త్రిపాఠి, శివమ్ దుబే, ధోని జడేజా ఇప్పుడు కొత్తగా వచ్చిన సామ్ కరణ్ వీళ్లు ఏ ప్లేస్ లో అయినా అడ్జెస్ట్ అయ్యి ఆడగలరు వన్ డౌన్ నుంచి 6th డౌన్ వరకు సో వీళ్ళకి బ్యాటింగ్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది
బౌలర్స్:
CSK మెయిన్ బౌలర్ అయిన దీపక్ చాహర్ ని ఈసారి ముంబై మేనేజ్మెంట్ తీసుకుంది. వీల్లకున్న బౌలర్స్ మహేష్ పతిరణ 13 కోట్లు .. ఖలీల్ అహ్మద్ 4.8 కోట్లు ఇతను లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు.. గుర్జపనీస్ సింగ్ 2.2 కోట్లు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యంగ్ ప్లేయర్ ఇతని కోసం చాలా పెట్టారు నాథన్ ఎల్లిస్ ఆస్ట్రేలియన్ బౌలర్ 2 కోట్లు .. ముకేశ్ చౌదరి 30 లాక్స్ లెఫ్ట్.
ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్..
CSK మేనేజ్మెంట్ డ్రా బ్యాక్ ఏంటంటే ఫినిషర్స్ మీద ఫోకస్ చెయ్యలేదు ఓన్లీ ధోని మాత్రమే ఉన్నారు. ధోని తర్వాత ఆ ప్లేస్ ని సామ్ కరణ్ తో ఫిల్ చెయ్యొచ్చు.. కానీ లియామ్ లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టింగ్ బాట్స్మన్ లేరు అయిన ధోని ఒక్కరే చాలు అంటున్న Csk మేనేజ్మెంట్.
అవసరం లేని ధోని నే మ్యాచ్ ని ఫినిష్ చెయ్యగలరు..
CSK బెస్ట్ ఎలెవన్ టీం: ఓపెనింగ్ లో రుతురాజ్, డెవాన్ కాన్వే, త్రిపాఠి.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో శివమ్ దుబే,జడేజా.. ఫినిషర్స్ రోల్స్ కింద ధోని, సామ్ కరణ్.. స్పిన్ డిపార్ట్మెంట్ నూర్ అహ్మద్, అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లు గా మహేష్ పతిరణ,గుర్జపనీస్ సింగ్ లేదా ఖలీల్ అహ్మద్.. ఫైనల్ గా ఐపీల్ మెగా ఆక్షన్ అయిన తర్వాత ప్రతి టీం మేనేజ్మెంట్ హోటల్ రూమ్స్ కి వెళ్లి సెలెబ్రేట్ చేసుకుంటారు.. కానీ csk మేనేజ్మెంట్ డీసెంట్ గా కావాల్సిన ప్లేయర్స్ ని మాత్రమే పిక్ చేసుకొంటుంది.. ధోని అండ్ టీం కూడా సెలెబ్రేట్ చేసుకుంటారు హోటల్ రూమ్స్ లో కాదు బయ్యా చెపాక్ స్టేడియం లో..
ఆర్టికల్ రాసిన వారు: పన్నీరు సాయికిరణ్